Thursday, February 8, 2007

My First Telugu Post - నీతి కథ


అనగనగా ఒక ఊరిలో ఒక మోతుబరి రైతు ఉండెను. అతనికి ఒక బాతు ఉండెను. ఆ బాతు రోజూ ఒక బంగారు గ్రుడ్డు పెట్టుచుండెను. రైతు ఆ గ్రుడ్డుని విక్రయించి ఆనందముగా జీవించసాగెను.

ఒక రోజు అఖస్మాత్తుగా ఆ రైతుకి పోగాలము దాపురించినది. వెంటనే అతనికి ఒక ఆలొచన వచ్చినది. "రోజుకి ఒక గ్రుడ్డు పెట్టుచున్నది కదా ఈ బాతు... దీని కడుపులో ఇంకా ఏన్ని గ్రుడ్లు ఉన్నాయో!!!??? దీని పొట్ట కోసి ఆ గ్రుడ్లు అన్ని ఒకేసారి అమ్మి నేను ధనవంతుడిని అయ్యిపోవచ్చు కదా?", అని తలంచెను. అనుకున్నదే తడవుగా ఆ బాతుని పట్టుకొని దాని పొట్ట కొసి, అందులో ఏమియును కానరాక మిక్కిలి వగచెను.

కథ కంచికి, మనం ఇంటికి.

నీతి: దురాశ దుఃఖానికి చేటు

If you cannot view the Telugu post(s) properly, get this Firefox extension https://addons.mozilla.org/firefox/873/ or any Telugu Font for IE

3 comments:

మాకినేని ప్రదీపు said...

తెలుగు బ్లాగు లోకానికి స్వాగతము.

Ramanadha Reddy said...

అర్రర్రే. భలే. ఇందులోని భాష పెద్దబాలశిక్ష కాలం నాటిదిగా వుంది. మంచి కథ. చిన్న కథలో ప్రారంభించారు. స్వాగతం.

radhika said...

welcome