Tuesday, July 17, 2007

సరదా వాక్యాలు/పాటలు

సరదాగా మనం చిన్నప్పుడు వాడిన వాక్యాలు/పాటలు

1. కొన్ని సందర్భాలలో...
వాట్ ఈజ్ దిస్? వంకాయ పుల్స్. నీకేం తెల్స్, నిమ్మకాయ పుల్స్.

2. మిత్రుడి అప్పు తీర్చేసిన తరువాత, వాడితో...
నీకు నాకు బాకీ లేదు, బందరు బస్సు ఖాళీ లేదు.

3. దాగుడుమూతలు ఆడేటప్పుడు...
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?

4. "గుడి గుడి గుంజం" ఆడేటప్పుడు...
గుడి గుడి గుంజం గుళ్ళో రాగం. పాముల పట్నం...

5. గొడుం బిళ్ళ ఆడిన తరువాత, పెట్టే "కూత"...
అగడం పగడం నెమలికి దంతం సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమణి...

6. అమ్మాయిలు "ఉప్పల కుప్ప" ఆడేటప్పుడు...
ఉప్పల కుప్ప వయ్యరి భామ...

7. ఏడు చాపల కథలో, చివరికి చీమ ఏమంటుంది అంటే...
నా బాంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?

నాకు గురుతు ఉన్నవి మాత్రం రాశాను. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే వీటికి జతపరచండి.
--- కృతజ్ఞుడను

5 comments:

వెంకట రమణ said...

చిన్నప్పుడు వాడిన వాక్యాలను బాగా గుర్తు చేశావు.
కృతఘ్ఞుడను సరికాదు, కృతజ్ఞుడను సరైనది.

నేనేమైనా గుర్తున్నానా?

Ravi Kumar Mandala said...

ఓర్ని దుంప తెగా, ఎంకటరమణా... నువ్వా? ఎలా ఉన్నావు?
సరిచేశా, పో. పండగ చేసుకో ;-)

Anonymous said...

8) vanda ...nee bonda..

9) saree.....nee taata lorry.

10)

sudha said...

10) ఒప్పుల కుప్ప లాగానె ఆడతారు
అప్పుడు " ఛెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం "

11) పిల్లలను వరుసగా కుర్చొబెట్టి వాళ్ళ కాళ్ళను లెక్క పెదుతు " కాళ్ళా గజ్జె కంకాళ్ళమ్మ వేగు చుక్క వెలగామొగ్గ "

12) ఇద్దరు పెద్ద పిల్లలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని పైకి ఉంచుతారు. మిగిలిన పిల్లలందరు వాళ్ళ చెతుల మద్యలొంచి వెళ్తారు. అప్పుడు " దెబ్బకి రెందు ద్రాక్ష పళ్ళు, తియ్యన పుల్లన నాకేం తెలుసు "

13) ఇద్దరు ఆడపిల్లలు చమ్మచక్క ఆడెటప్పుదు " చమ్మచక్క చారడేసి మొగ్గ "

14) ఆట్లతద్దె నాడు " అట్ల తద్దొయ్ ఆరట్లొయ్ ముద్ద పప్పోయ్ మూడట్లొయ్ "

15) చిన్న పిల్లలు ఏడ్చెటప్పుడు " ఏడవకు ఏడవకు వెర్రి చెల్లమ్మ ఏదిస్తె నీ కళ్ళు నీలాలు కారు

Unknown said...

bale gurtu chesaav ra..
Had fun reading ur blog!
--RAJESH