Sunday, September 2, 2007

రవీంద్రనాథ్ "ఠాగూర్‌"

ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం "లంచం". అదే నా ఆవేదన, సగటు భారతీయుడి ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చెయ్యలేక కన్నీళ్ళు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లులను ఎందర్నో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి, అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతూ ఉంటే... చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్???
ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ,
ఒక ఇండియా రెండొందలయాభై సింగపూర్లతో సమానం.
ఒక ఇండియా ఎనిమిది జపాన్లతో సమానం.
ఇండియా జనాభా నూటరెండు కోట్లు, అమెరికా జనాభా? ఇరవై ఎనిమిది కోట్లు. ఇరవై ఎనిమిది కోట్లలో ఒక బిల్‌గేట్స్ పుడితే, నూట్రెండు కోట్లలో ఎంత మంది పుట్టాలి? కాని, ఒక్కడు, ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం?

మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే... "లంచం"
మేధావులు మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే... "లంచం"
అందుకే సార్, భవిష్య బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు.

చెప్పులు కుట్టుకొనే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహాం లింకన్-లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం...? "లంచం"

మన దేశంలో అడుగడుగునా లంచం...
మునిస్పాలిటి నీళ్ళు రావటానికి లంచం, ఇళ్ళు కట్టటానికి లంచం,
కరంటు ఇవ్వటానికి లంచం, ఆ కరంటు తియ్యకుండా ఉండటానికి లంచం,
రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోటానికి లంచం,
రైతులకు రుణాలు ఇవ్వలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం,
హాస్పటల్లో బెడ్డుకు లంచం, తినే బ్రెడ్డుకు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం,
బర్త్ సర్టిఫికెట్ లంచం, డెత్ సర్టిఫికెట్ లంచం, మనిషి పుట్టిందగ్గర్నుంచి చచ్చిందాకా "లంచం, లంచం, లంచం"

అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెలదాకా అవినీతి నడుస్తూ ఉంటే... బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్?

రిక్షా వాడికి భయం, పోలీసంటే... పగటి పూట లైట్ లేదని కేస్ పెడతాడేమోనని;
లారి డ్రైవర్‌కి భయం, అర్టివో అంటే... పర్మిట్ ఉన్నా లేదని లారీని రొడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని;
రిటైర్ అయ్యినవాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే... నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని;
పిల్లలను కన్న తల్లిదండ్రులకు భయం, కాన్వెంట్ చదువులంటే... ఎల్కేజి సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని;

ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలీ, రోజంతా కష్టపడి సంపాదించినదాంట్లో ఈ లంచగొండ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్ళాంబిడ్డలని ఏమని పోషిస్తారు సార్???
వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు!

ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలి పోయింది.
ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ మాటలు గుర్తుచేసుకోండి.
"ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో...
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగ్గలడో...
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలయిపోయి మగ్గిపోదో...
ఎక్కడ మన చదువూ విఙ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకి పోదో...
ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో...
అక్కడ, ఆ స్వేఛ్చా స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు"
...అంటూ ఆయన "గీతాంజలి" రచించాడు.

7 comments:

cbrao said...

బాగా ఉంది.ఈ సమస్యకు పరిష్కారం కనపడటం లేదు.

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

ఈ డైలాగులన్నీ చిరంజీవి "ఠాగూర్" సినిమాలోనివి అని ఒక ముక్క రాసివుంటే బావుండేది.

Ravi Kumar Mandala said...

అవునండి. ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్‌లో కోర్ట్‌లో జరిగే సన్నివేశంలోనివే ఈ డైలాగులు. మనస్సుకి హత్తుకొనేలాగా, ఆలోచింపచేసేవిగా ఉన్నాయని నచ్చి రాశాను. నిజానికి నా ఆవేదన కూడా అదే.

రానారె said...

ఆర్డర్ ఆర్డర్! అందరం ఆవేదన చెందేవాళ్లమేగానీ, మన పని ఏదైనా జరగడానికి లంచం ఇవ్వాల్సొస్తే ఇవ్వకుండా పనిజరిగేలా మాత్రం కనీసం ప్రయత్నించం.

రాధిక said...

నాకు చిరంజీవి సినిమాల్లో బాగా నచ్చిన మాటలివి.కానీ సినిమాలో చూపిన మార్గం మాత్రం ఆచరణీయం కాదు.

రమణ said...

నీ బాధ నాకు అర్ధమయ్యింది. నువ్వు లంచానికి, అవినీతికి దూరంగా ఉండు సరిపోతుంది. ఆచరణలో అదొక్కటి మాత్రమే చేయగలం

jagadeesh said...

చాలా బావుంది ! సూపర్ డైలాగ్