Sunday, December 13, 2009

US Vs us

.
We CLICK a button, they PUSH it.
We travel in KILOMETERS, they travel in MILES.
We spend a currency NOTE, they spend dollar BILL.
After eating we ask for BILL, they ask for CHECK.
We travel on LEFT side of the road, they travel on RIGHT.
We rarely drive SILENT, they rarely HONK.
We say 11/9, they say 9/11. [Interestingly, the twin towers were attacked on 9/11, which is emergency rescue contact number there]
We press the switch DOWN to switch it on, they press it UP.
.
.

Tuesday, November 17, 2009

హెల్మెట్ వలన ఉపయోగాలు

.
1. ప్రమాద సమయాల్లో తలకి రక్షణ - శిరస్త్రాణం
2. వర్షం పడుతున్నప్పుడు - గొడుగు
3. కళ్ళకి రక్షణ - కళ్ళ జోడు.
4. శబ్ద కాలుష్యం నుంచి చెవులకి రక్షణ
5. ఈ మధ్య సెల్ ఫోన్స్ హెల్మెట్లోనికి తోసి. బండి నడుపుతూ మాట్లాడుతున్నారు - హాండ్స్ ఫ్రీ
6. చెవులు కప్పి చలి నుంచి రక్షణ కల్పిస్తుంది
7. హెల్మెట్ పెట్టుకొని మనలో మనం ఎంత మాట్లాడుకున్నా, పాటలు పాడుకున్నా ఎవరికీ వినపడదు - సౌండ్ ప్రూఫ్
8. పోలీసుల నుంచి మన జేబుకి రక్షణ
.
.

ఫర్స్ట్ డే! ఫర్స్ట్ షో!! ఫర్స్ట్ టికెట్!!!

...
శుభమా అంటూ ఒక ద్విచక్ర వాహనం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకొని, పూజ చేయించి, ఆఫీసుకి బయలుదేరాను. ఈ ఆనందాన్ని సహోధ్యోగులతో పంచుకుందామని వారి కోసం మిఠాయి కొందామని ఒక బేకరి దగ్గర ఆగాను. చక్కగా ఒక కేజి మిఠాయి కొని, అక్కడి నుంచి ఎంతో "స్వేచ్చ"గా బయలుదేరాను. ఇప్పుడు అన్ని శబ్ధాలు స్పష్టంగా వినపడుతున్నాయి. నిజం చెప్పాలంటే శబ్ధ కాలుష్యం నా చెవులకి చిల్లులు పొడుస్తోంది. తేడా ఏమిటా? అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది "నా హెల్మెట్". వామ్మో, హెల్మెట్ బేకరీలో మర్చిపోయి, హాయిగా నా బండి మీద సవారీ చేసుకుంటూ వెళ్తున్నానన్న విషయం అప్పుడర్ధం అయ్యింది. ఇప్పుడు కాని ట్రాఫిక్ పోలీసులు అపారంటే జేబుకి చిల్లు పడుతుంది అని, వెనుతిరిగి సందు-గొందుల్లోంచి బేకరీవైపు బయలుదేరాను. నా దురద్రుష్టంకొద్దీ ఒక సందు చివర నక్కి ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు... అందులో ఒక పొలీసు వచ్చి నన్ను ఆపి పలకరించింది. ఉభయకుశలోపరి అని అన్నాను. "మనలో మన మాట... హెల్మెట్ ఏది బాసూ?" అని అడిగింది. మనలో మనకి హెల్మెట్ ఎందుకులెండి అని అన్నాను. వెంటనే తన బ్లాక్బెర్రి తీసి, నా లైసెన్స్ లాక్కుని ఒక టిక్కెట్ కోసింది. ఇంకా చేసేది ఏమి లేక ఒక వంద సమర్పించుకొని అక్కడి నుంచి బయలుదేరాను. ఆ విధంగా మొట్టమొదటి రోజే ట్రాఫిక్ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కింది, నా బండి.
...
...

Monday, November 16, 2009

దగ్గు రహస్యాలు

పక్షుల "కిలకిలా"రావాలు మనకి అర్ధం కావు. ఆవుల "అంబా అంబా" అరుపులు కూడా మనకి అర్ధం కావు. అలాగని వాటికి అర్ధం పర్ధం లేదని మనం అనగలమా? అవి వాటి భాష. అదే విధంగా ఎవరైనా దగ్గుతుంటే కూడా మనకి అర్ధం కాదు.

నేను చెప్పొచ్చేది ఏమిటంటే... దగ్గు కూడా ఒక భాషే. అయితే మనం అందరం దగ్గుతూ ఉంటాం. ఇంతకీ మనకే తెలియకుండా దగ్గు భాషలో మనం ఏమి మాట్లాడతామో తెలుసా? ఆలోచనలు.

నిజమేనండి. మనం దగ్గేటప్పుడు మనకి తెలియకుండా మన ఆలోచనలు బయటికి వచ్చేస్తాయి. ("నీకెవరు చెప్పారు?" అని అడగకండే...)

ఉదాహరణకి ఒకటి వదులుతా, కాసుకోండి. ఏదైనా గదిలోకి ప్రవేశించగానే గొంతు సవరించుకున్నట్లు ఒక చిన్న దగ్గు దగ్గుతాం చూశారా... దానికి అర్ధం మనకందరికీ తెలుసు కదా? మీరు మరీనూ. అన్నీ నాతోనే చెప్పిస్తారు! ఎందుకంటే అప్పుడు మన "ఆలోచనా" విధానం ఇట్లా ఉంటుంది, "నేను వచ్చినా ఇక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదేమిటబ్బా???"

మనలో మన మాట... మీకు తెలుసో లేదో కాని, ఎంత దగ్గుతో బాధ పడుతూ ఉన్నా కూడా (ఇక్కడ "ఆలోచనలతో సతమతమవుతున్నా కూడా" అని చదవండి) నిద్ర పోయినప్పుడు దగ్గు ఆగిపోతుంది. అంటే నిద్రపొతే వాటన్నింటికీ విరామం దొరుకుతుందనటానికి ఇది మరొక ఋజువు.

Tuesday, August 4, 2009

ఇదెక్కడి కాస్ట్ కుట్టింగురా బాబూ!!!???

ఈ రోజుల్లో కార్పొరేటు ప్రపంచంలో కాస్ట్ కుట్టింగు ఎక్కువ అయ్యిపోయింది. కొన్ని ఆఫీసుల్లో ఇది వింత పోకడలు పోతోంది (కొత్త పుంతలు తొక్కుతోంది).

ఉధాహరణకు... టాయిలెట్లకి ఉండే ఆటోమేటిక్ సెన్సార్లు తేసివేసి, మ్యాన్యువల్ ఫ్లష్లు అమర్చుతున్నారు (బహుశా మెయింటెనెన్స్ సులువుగా ఉంటుందనేమో). ఇదెక్కడి "ఆదా" చెప్పండి. దీనినే "కాస్ట్ కుట్టింగు కంపు" అని అంటారు కాబోలు!!!

Tuesday, July 28, 2009

కూరిమి గల దినములలో...

...


కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనప్పుడు
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!

అని సుమతీ శతకంలో ఎప్పుడో చెప్పారు. దీనిని బట్టి మనకు తెలియవచ్చింది ఏమిటయ్యా అంటే... మిత్రులు ఎల్లప్పుడూ కలిసి ఉన్ననూ ఎప్పుడో ఒకప్పుడు వారి మధ్య బేదాభిప్రాయములు రాక మానవు. అది కూడా చాలా విధాలుగా మంచిది అనుకోండి. అలా రాకపోతే అది స్నేహమే కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే, లోకంలో ఏ ఇద్దరు మనుష్యులూ, వారి మనస్తత్వాలూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడు బేదాభిప్రాయాలు రాలేదు అంటే ఏమిటి అర్ధం? ఇద్దరిలో ఒక్కరే ఎప్పుడూ సర్దుకుపోతున్నారని. అటువంటి స్నేహం హర్షింపతగ్గదా చెప్పండి? ఇంకా అస్సలు విషయానికి వస్తే... మొన్నీమధ్య పై పద్యం విన్నప్పుడు నాకొక మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
మిత్రులు ఎప్పుడూ సర్దుకు పోతూ ఉంటారు. ఏదైనా మనస్పర్దలు వచ్చినప్పుడు "నువ్వప్పుడు అది చేసావ్, నువ్విప్పుడు ఇది చేసావ్" అంటూ గొడవ మొదలు పెడతారు. నేనంటానూ... అదేదో ఇప్పుడే ఒక మంచి సమయం చూసి (ఏమీ తోచనప్పుడు) ఈ విషయాలు చర్చించుకోవాలి... (ముఖ్యంగా రూంమేట్స్)
౧. ఎదుటి వారిలో మీకు ఏమి నచ్చలేదు.
౨. ఎదుటి వారిలో మీకు ఏమి నచ్చింది.
౩. మీకు మీరు ఏమి మెరుగుపర్చుకుందాం అని అనుకుంటున్నారు
౪. మున్ముందు సమస్యలను ఎలా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది...
దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మిత్రులు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవచ్చు. రాబోయే సమస్యలని ముందుగానే పసిగట్టొచ్చు. మీరే ఆలోచించండి.

(అప్పుడెప్పుడో ఇంకా చాలా అనుకున్నాను కానీ, ఈ టపా రాయటంలో కాలయాపన జరగటం వలన ఇప్పుడు అవన్ని మర్చిపోయాను. కాబట్టి "ఇంతే సంగతులు, చిత్తగించవలెను!")

Monday, July 27, 2009

It's both a gift and a curse - Monk

Monk is cleanliness freak and he wipes his hands with a tissue every time he shakes hands with someone.

Monk is crazy about keeping things organized, just like Monika in Friends and may be more.

Monk is proud to be an American; he touches poles on the street because they are a part of it.

Monk keeps track of time i.e., he can say how long has been this meeting going on without watching the clock.

Monk is good at memory and he can detect you are lying if it involves popular facts/news.

Monk observes every minute detail, which makes him a great crime-scene investigator.

Monk is good at putting facts together and he smiles a peculiar laugh when he got the last part of the puzzle which solves the case under investigation.

Monk has enemies from the cases he successfully solved.

Monk is scared of heights.

Monk says “You’ll thank me later”, but no one does.

Monk has great powers for which he says, “It’s both a gift and a curse!!!”