Sunday, November 4, 2012

నమ్మకూడని నిజాలు, మన తెలుగు సినిమాలు

రౌడీలు/కార్లు గాలిలో పల్టీలు కొట్టడం వంటి అద్భుతాలు పక్కన పెడితే... మన తెలుగు సినిమాలు మనల్ని మరికొన్ని విషయాల్లో జాంకాయిని చేస్తూ ఉంటాయి. మచ్చుకి కొన్ని చెబుతాను చూడండి...

1. ముహూర్తానికి తాళి కడుతూ ఉంటే "ఆపండి..." అని ఎవరో ఒకరు పెళ్ళిని ఆపినట్లు చూపిస్తూ ఉంటారు.
కాని నిజానికి: ...హిందూ ఆచారం ప్రకారం, ముహూర్తం సమయానికి జీలకర్ర-బెల్లం పెట్టిస్టారు. దానితో వివాహం జరిగిపొయినట్లే. తరువాత ఎప్పుడో కట్టే తాళి కట్టకుండా ఆపటం వలన ప్రయోజనం శూన్యం.

2. గతంలో జరిగిన సంఘటనల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ/చెబుతూ ఉంటారు.
కానీ... ఆ చెప్పేవారు లేని సన్నివేశాలు, వాళ్ళకి తెలియటానికి ఏమాత్రం అవకాశం లేని సన్నివేశాలని కూడా అంత క్షుణ్ణంగా ఎలా చెప్పగలరు చెప్పండి???

3. అమ్మాయి వాంతులు చేసుకొని భర్తతో "మీరు తండ్రి కాబోతున్నారు, నాకు ఇప్పుడు మూడో నెల" అని చెప్పటం మనం చూస్తూ ఉంటాం.
కానీ నిజానికి: ...ఆ విషయం మొదటి నెల నిండగానే తెలుస్తుంది. దీనిని నిర్ధారించుకోవాలంటే ఈ విషయాల్లో నిష్ణాతులైన మీ సన్నిహితులని అడిగి తెలుసుకోండి. అప్పుడే మీకు దాన్ని నెల తప్పటం అని ఎందుకు అంటారో తెలుస్తుంది.

4. కారుకి బ్రేకులు కత్తిరిస్తే పెద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు చూపిస్తూ ఉంటారు.
కాని నిజానికి: ...నాకు తెలియక అడుగుతున్నాను... కొండ దారి లేక బాగా ఎత్తు-పల్లం ఉంటే తప్ప యాక్సలరేటర్ మీద కాలు తీసేసి ఇగ్నీషన్ ఆపు చెసేస్తే కారు ఆగదా ఏమిటి!!!??? ...మనల్ని జాంకాయల్ని చెయ్యటం కాకపొతే!!!

3 comments:

చెన్నా రెడ్డి said...

:-) nice, good to see you can write good Telugu too....

PALERU said...

Nice...post Mr. Ravi gaaru

Unknown said...

telugu cinimalanu anthaga pattinchukovaddu